రోహిణి - పతంజలి శాస్త్రి గారి కథ , కథా పరిచయం

Harshaneeyam - Un pódcast de Harshaneeyam

Podcast artwork

Categorías:

రోహిణి’ పతంజలి శాస్త్రి గారి ‘రామేశ్వరం కాకులు’ అనే కథాసంకలనం లోనిది.• ఈ కథపై చక్కని సూచనలిచ్చి, ఆడియోని మీకందించడానికి సహకరించిన మిత్రులు ఛాయా మోహన్ గారికి కృతజ్ఞతలు.**’రామేశ్వరం కాకులు పుస్తకం’ అమెజాన్ లో దొరుకుతోంది. – http://amzn.to/3bFv5W2.కథనం:చరిత్ర లోని ఒక కథను Allegorical గా తీసుకొని, సమకాలీన సమస్యను ఎత్తిచూపుతూ, ఒక పరిష్కార మార్గాన్ని సూచనగా చెప్పడం, ఈ కథలో ముఖ్య ప్రక్రియ. ఈ ప్రక్రియ తో తెలుగు లో వచ్చిన మరో రెండు కథలు – చలం గారి ‘ ఓ పువ్వు పూసింది’ రావూరి భరద్వాజ గారి ‘ పాటకు తగిన రోలు’.కథలో ముఖ్యాంశం నదీజలాల వివాదం. రోహిణి నదీజలాల పై శాక్య , కోలీయుల వివాదం గురించి రెండు కథనాలు ప్రచారంలో వున్నాయి.తాను చూసిన కొన్ని సంఘటనల వల్ల సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడుగా మారిన తర్వాత,జలాల గురించి ఇరువర్గాలూ యుద్దానికి సిద్ధమైతే, గౌతముడు యుద్ధభూమికి వెళ్లినట్టుగా, ఆయన సమక్షంలో ఇరు వర్గాలూ తమ ఆయుధాలు విసర్జించి యుద్ధాన్ని మానివేశాయి అని ఒక కథనం చెప్తే… ( http://bit.ly/warsankyans)శాక్య వంశానికి చెందిన సిద్ధార్థుడు, జలాల వివాదం మీద జరిగిన శాక్యుల సమావేశంలో , తాను యుద్ధం యొక్క ఫలితాలను, అనర్థాలను ఎత్తిచూపినప్పుడు, వర్ణాశ్రమ ధర్మం గురించి చర్చ జరగడం, యుద్ధానికే, ఎక్కువమంది మొగ్గు చూపడంతో , వ్యతిరేకిస్తూ , సిద్ధార్థుడు సన్యసించడం , ఆ తరువాత కొంత కాలానికి ఇరువర్గాలూ యుద్ధాన్ని విరమించడం రెండో కథనం. (http://bit.ly/ambedkars (24-29, 56-57))పతంజలి శాస్త్రి గారు రాసిన ఈ కథలోని విశేషం, ఈ రెండు కథనాలనూ సమన్వయం చేయడం.ఇలా ఒకే చారిత్రిక ఇతివృత్తం పై వున్న రెండు వేరు వేరు కథనాలలోని ముఖ్య అంశాలను స్పృశిస్తూ, ఒక సమకాలీన సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించారు ఈ కథ ద్వారా రచయిత.కథలోని సమస్య గురించే గాక , నేటి సమాజంలో ఉండే ఎన్నో ప్రధాన సమస్యలపై , పరిష్కారం దిశగా, గౌతముని వాక్యాలను ఎన్నుకుని కథలో భాగంగా మనకందించడం శాస్త్రి గారి రచనా ప్రతిభకు ఒక నిదర్శనం.ఏ సమస్య పరిష్కారానికైనా , సరైన దృక్పధం, సమస్య పరిమితులు అర్థం చేసుకోవడం ముఖ్యమన్న విషయం కథ మనకు తెలియజెప్తుంది.కథలో భాగంగానే, ఈనాటి సామాజిక వర్గీకరణను సూచిస్త, వ్యాపార, శ్రామిక వర్గాలకు ఉండవలసిన సరైన దృక్పధం గురించి , వారికి సమాజం పట్ల ఉండవలసిన బాధ్యత గురించి కూడా చర్చించడం జరుగుతుంది.కథ చివరి అంకం అంతా గౌతమ బుద్ధుడి ఆశ్రమంలో జరగడం, చర్చలకు కావలసిన వాతావరణం ప్రాధాన్యత ను గురించి రచయిత చెప్పినట్టుగా ఉంటుంది. అదే విధంగా రోహిణి నదిని వర్ణించేటప్పుడు , కథలో రాబోయే సందర్భం గురించి సూచిస్తున్నట్టుగా ఉంటుంది.కథలో ముఖ్యంగా గమనించవలసింది గౌతమబుద్ధుడు (శాస్త) పలికిన వాక్యాలు, ఇంకా ఆయన సమక్షం లో శ్రోతలు పొందే అనుభూతిని గురించి రచయిత వర్ణన.కథలోని ముఖ్య సన్నివేశాలలో తటస్థపడే నెమలి, బౌద్ధమతస్థుల నమ్మక ప్రకారం, విశాలహృదయానికీ, అంగీకారానికీ, చిహ్నం. ( http://bit.ly/buddhismpeacock )అలాగే, రోహిణి నది వివాదం, మన దేశంలో కావేరీ జలాల సమస్య, పాలస్తీనా ప్రాంత వ్యవహారాలూ, అక్కడి జోర్డాన్ నది వినాశనం మనకు గుర్తుకుతెస్తుంది. (http://bit.ly/jordanpollution)ఈ కథ ఆడియో రూపం లో , సుప్రసిద్ధ రేడియో ఆర్టిస్ట్ శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి గళాన మీరు వినవచ్చు.కథ:రోహిణీ నది, సంధ్యాసమయంలో శాన్త భుజం మీది నుంచి జారిన కాషాయాంబరంలా వుంది. ఇప్పటి పరిస్థితి విషమిస్తే ఇరుపక్షాల రక్తంతో రోహిణికి రక్తపుజీర పడుతుందనుకున్నాడు ఉపాలి. ఉపాలి భిక్షు అంతకుముందే నదిలో స్నానించి, బట్టలు పిండుకుని, ఒడ్డుకు చేరి మంద్రంగా ప్రవహిస్తున్న నదిని చూస్తూ అట్లా అనుకున్నాడు.ఎగువ నుంచి ఒడ్డుకు సమీపంగా పొడవాటి గెడ సాయంతో వంపు తిరుగుతోంది పడవ. అట్లాగే చూస్తూండిపోయాడు ఉపాలి. మనోహరమైన సంధ్యగాలి అలలు ఉపాలి శరీరాన్ని మనసునీ మృదువుగా తాకి వెళ్లిపోతున్నాయి. ఈవలివైపు ఆమ్ర వన విహారం చేరిన కొద్ది దినాల నుంచి నదిని చూసినప్పుడల్లా, కంఠం వరకూ మునిగినప్పుడల్లా తన నుంచి తాను వేరుపడి ఆవల బాల్యం గడిపిన అస్పష్టమైన శాక్యసీమను చూశాడతను. అక్కడే ఒక రాకుమారుడు ఉదయకాంతిలోకి గుర్రం మీద వెళ్లిపోవడం కూడా జ్ఞాపకం వస్తుంది. ఈ...

Visit the podcast's native language site